కాగా ఇటీవల 15 మంది సభ్యులతో కూడిన టీమిండి అటు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్తో జరగబోతుంది. అక్టోబర్ 23వ తేదీన జరగబోయే ఈ మ్యాచ్ కోసం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో అధికారిక మ్యాచ్లకు ముందు అటు టీమిండియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా జట్లతో వార్మప్ మ్యాచ్ లు ఆడబోతుంది. ఈనెల 17, 18 తేదీలలో ఈ మ్యాచ్లు జరగబోతున్నాయి అని చెప్పాలి.
ఇలాంటి సమయంలోనే ఇక టీమ్ ఇండియా అభిమానులందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. 17, 18 తేదీలలో జరగబోయే వార్మప్ మ్యాచ్ లను కూడా అటు లైవ్ లో ప్రసారం చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరగబోయే మ్యాచ్ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభించనుండగా.. ఇక ఇండియా- న్యూజిలాండ్ మధ్య జరగబోయే మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ కాబోతుందని స్టార్ స్పోర్ట్స్ తెలిపింది. ఇక క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్ -పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్ మ్యాచ్లను కూడా ఇలా లైవ్ లో వీక్షించేందుకు అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి