ఈ క్రమంలోనే ఇక భారత జట్టు మిగిలిన అన్ని మ్యాచ్లలో గెలవడం ద్వారా అటు పాకిస్తాన్ కు ఉపయోగకరంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత్ ఇటీవల సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది. తద్వారా ఇక పాకిస్తాన్ కు ఉన్న సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి అని చెప్పాలి. అద్భుతాలు జరిగితే తప్ప పాకిస్తాన్ సెమీఫైనల్ లో అడుగుపెట్టలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇటీవల బిసిసిఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టి20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరడం కష్ట సాధ్యం అంటూ రోజర్ బిన్నీ జోష్యం చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఇక పాకిస్తాన్ భారీ తేడాతో తర్వాత మ్యాచ్ లలో విజయం సాధించి సెమీఫైనల్కు చేరితే మాత్రం సంతోషపడే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనే ఉంటాను అంటూ రోజర్ బిన్నీ తెలిపాడు. అయితే క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్ అని.. అది మీకు తెలియనిది కాదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక క్రికెట్లో ఎప్పటికైనా ఏదైనా జరగొచ్చు అంటూ రోజర్ బిన్నీ వ్యాఖ్యానించాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ను ఇంటికి పంపడానికి భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిందంటూ ఆరోపణలు కూడా చేస్తున్నారు పాక్ అభిమానులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి