అనుకున్నంత స్కోర్ మాత్రం ఆస్ట్రేలియా చేయడంలో ఫెయిల్ అయింది. ఒక దశలో స్కోర్ 180 దాటుతుందని అనుకుంటే చివరికి నిర్ణీత ఓవర్లలో కేవలం 168 పరుగులు మాత్రమే చేసింది. వార్నర్ కు ఆరంభం దక్కినా బిగ్ స్కోర్ గా మలచలేకపోయాడు, మార్ష్ (45) మరియు మాక్స్ వెల్ (54) లు జట్టుకు ఈ మాత్రం స్కోర్ అయినా రావడంలో హెల్ప్ అయ్యారు. ఇక ఛేదన స్టార్ట్ చేసిన ఆఫ్ఘన్ కు మరోసారి గర్భాజ్ టెర్రిఫిక్ స్టార్ట్ ను ఇచ్చాడు. కానీ స్కోర్ బోర్డు నెమ్మదగినా సాగింది. ముఖ్యంగా ఇబ్రహీం మరియు నైబ్ లు వికెట్లు కాపాడుకున్నా చేయాల్సిన టార్గెట్ ను మరిచిపోయి మరీ నెమ్మదిగా ఆడారు. దీనితోఓవర్ కు 15 పరుగులకు పైగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆ సమయంలో రషీద్ ఖాన్ దూకుడుగా ఆడి దాదాపు ఆఫ్ఘన్ ను గెలిపించినంత పనిచేశాడు. చివరికి కేవలం అయిదు పరుగుల దూరంలో ఆఫ్ఘన్ ఆగిపోయింది. రషీద్ ఖాన్ కేవలం 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇతని ఇన్నింగ్స్ లో ఫోర్లు 3 సిక్సర్లు 4 ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు రషీద్ ఖాన్ వెన్నులో వణుకు పుట్టించాడు. ఇదే దూకుడు మధ్యలో ఇంకెవరైనా ఆడి ఉంటే ఈ రోజు సంచలనం నమోదు అయి ఉండేది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి