సాధారణం గా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఏదైనా మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు అభిమానులు అందరూ కూడా భారీ రేంజ్ లో అంచనాలు పెట్టు కుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఆ మ్యాచ్ లో తప్పకుండా టీమ్ ఇండియా గెలిచి తీరుతుంది అని ఎంతగానో నమ్మకం పెట్టుకుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా అభిమానులు నమ్మకం పెట్టుకున్న సమయం లో ఆటగాళ్లు ఎవరైనా సరైన ప్రదర్శన చేయలేక చివరికి నిరాశ పరిచారు అంటే ఇక వాళ్లని సోషల్ మీడియా వేదికగా ఒక ఆట ఆడుకుంటారు అభిమానులు.


 అతనికి ఆడటం చాత కాదని.. ఏకంగా జట్టు నుంచి పక్కకు పెట్టేయాలి అంటూ సోషల్ మీడియా వేదిక గా ట్రోల్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా భారత జట్టు లోకి వచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఒక్క క్యాచ్ వది లేయడం కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు యువ బౌలర్ అర్షదీప్ సింగ్. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఆసిఫ్ అలీ ఇచ్చిన క్యాష్ ను వదిలేసాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో ఎంత తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఏకంగా అర్షదీప్ సింగ్ భారతీయుడు కాదు ఖాలిస్తాని అంటూ కొంతమంది కాస్త ఘాటు గానే విమర్శలు చేశారు.  అయితే ఈ అంశం పై అతను ఇటీవల స్పందించాడు. దేశంలో క్రికెటర్లను వారి ఆటను అభిమానులు ఎంతగానో ప్రేమిస్తారు. అయితే బాగా ఆడినప్పుడు ఎలా అయితే సంతోషం వ్యక్తం చేస్తారో.. ఇక ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక నిరాశపరిచినప్పుడు అలాగే అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇక మాపై కోపగించుకునే తిట్టే హక్కు అభిమానులకు ఉంటుంది. వాటిని మేము తీసుకోవాల్సిందే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అర్షదీప్ .

మరింత సమాచారం తెలుసుకోండి: