2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి . ఈ క్రమంలోనే ఇటీవల రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసిన బీసీసీఐ మరికొన్ని రోజుల్లో అటు మినీ వేలం నిర్వహించబోతుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక  ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీ అటు మరింత నాణ్యతతో కూడిన ఆటను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే సమయంలో ఇక క్రికెట్ ను మరింత ఉత్కంఠ భరితంగా మార్చేందుకు సరికొత్త నిబంధనలను కూడా తెరమీదకి తీసుకువస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి అన్ని సనాహాలను ఇప్పటి నుంచే బిసిసిఐ మొదలు పెట్టిన నేపథ్యంలో  ఐపీఎల్ గురించి ఏ వార్త బయటకు వచ్చినా కూడా అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇటీవల 2023 ఐపీఎల్ సీజన్లో బీసీసీఐ కొత్త రూల్ ప్రవేశపెట్టబోతుంది అన్న వార్త ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ను తెరమీదకి తీసుకువచ్చింది బీసీసీఐ. ఇక ఈ రూల్ను ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో అమలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఈ రూల్ ప్రకారం ఒక ఆటగాడు గాయపడినప్పుడు అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయడానికి బౌలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 2023  ఐపీఎల్ సీజన్లో ఈ కొత్త రూల్ను ప్రవేశపెట్టబోతుండట బీసీసీఐ. ఇక ఈ రూల్ ప్రకారం రెండు ఇన్నింగ్స్ లోను కూడా 14 ఓవర్ ముగిసే లోపే ఇంపాక్ట్ ప్లేయర్ ను సబ్స్టిట్యూట్ గా బరిలోకి దింపాల్సి ఉంటుంది.  అయితే కెప్టెన్ హెడ్ కోచ్ ఇద్దరు కూడా ఆన్ ఫీల్డ్ ఎంపైర్లకు ఇక ఇందుకు సంబంధించిన సమాచారం అందించాలి. అంతేకాకుండా ఒకవేళ గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ ను తీసుకుంటే.. ఇక ఇలా గాయం కారణంగా మైదానం వదిలిన ఆటగాడు మళ్ళీ మైదానంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL