భారీ అంచనాల మధ్య ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ఇక అటు క్రీడాభిమానులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరికి అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే మెస్సి కి ఇదే చివరి వరల్డ్ కప్ అని అందరూ అనుకుంటున్నారు. దీంతో జట్టు వరల్డ్ కప్ గెలవడంతో అభిమానులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఫ్రాన్స్ ఫైనల్ వరకు వెళ్లి ఓడటంతో అభిమానులు నిరాశలో మునిగి పోయారు.


 ఈ క్రమంలోనే ఇక ఫ్రాన్స్ జట్టును గెలిపించేందుకు ఆ జట్టులో స్టార్ క్లియర్గా కొనసాగుతున్న అంబాపే ఎంతలా పోరాడినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది అని చెప్పాలి. ఫైనల్ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా వరుసగా హ్యాట్రిక్ గోల్స్ చేసి అదరగొట్టాడు అంబాపే. అయినప్పటికీ అర్జెంటీనా  జట్టు కూడా అద్భుతంగా రాణించడంతో ఇక ఫ్రాన్స్ విజయం సాధించడానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన కారణంగా ఎంబాఫే ఏకంగా గోల్డెన్ బూట్ అవార్డును కూడా అందుకున్నాడు.


 అంతేకాకుండా ఇక అర్జెంటినా చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడంతో అంబాపే ఎంతగానో నిరాశలో మునిగిపోయాడు అన్న విషయం తెలిసిందే  ఇక మైదానంలో కూర్చుని ఎంతో బాధపడుతున్న అంబాపే దగ్గరికి ఫ్రాన్స్ అధ్యక్షుడు స్వయంగా వచ్చి ఓదార్చడం కూడా చూశాము. అయితే ఇటీవల ఓటమిపై తొలిసారి స్పందించాడు అంబాపే. ఈ క్రమంలోనే గోల్డెన్ బూట్ పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ మేము మళ్లీ వస్తాం అంటూ ఒక పోస్ట్ పెట్టగా.. వైరల్ గా మారిపోయింది. దీనిపై స్పందించిన బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నువ్వు యోధుడివి.. ఇప్పుడు నీ టైం అంటూ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: