మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే పురుష క్రికెటర్లతో సమానంగానే అటు మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు చెల్లిస్తాము అంటూ నిర్ణయం తీసుకుని ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇక మహిళా క్రికెట్కు మరింత ఆదరణ పెరిగే విధంగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా మహిళ క్రికెటర్లకు ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే.


 2023 ఏడాదిలో మెన్స్ ఐపీఎల్ తో పాటు అటు ఉమెన్స్ ఐపీఎల్ టోర్ని  కూడా నిర్వహించేందుకు అన్ని సన్నాహాలను చేస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్లో ఉండే జట్లను కొనుగోలు చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలకు   అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక ఉమెన్స్ ఐపీఎల్ లో ఎన్ని జట్లు పోటీ పడబోతున్నాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఉమెన్స్ ఐపీఎల్లో ఐదు ఫ్రాంచైజీలు పోటీ పడబోతున్నాయి అన్నది తెలుస్తుంది.  ఇక ఈ నెల 25వ తేదీన ఈ ఐదు ఫ్రాంచైజీలను కూడా ఎంపిక చేసేందుకు బీసీసీఐ నిర్ణయించిందట.


 కాగా ఇక ఈ ఐదు ఫ్రాంచైజీలు, మ్యాచ్ల వేదిక కోసం గత వారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి టెండర్లను పిలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలను ఎవరు కొనుగోలు చేస్తారు అను విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. 2023 నుంచి 2025 మధ్య మూడు సీజన్లో ఒక్కో జట్టుకి 25 మ్యాచ్లు నిర్వహించాలని అటు బీసీసీఐ భావిస్తుందట. ఇక లీగ్ దశలో 20 మ్యాచ్లు ఆడనుండగా.. టాప్ ప్లేస్ లో ఉండే జట్టు నేరుగా ఫైనల్ కు వెళుతుంది. రెండు మూడు స్థానాల్లో నిలిచిన టీంలు ఎలిమినేటర్ మ్యాచ్   ఆడుతాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది అని బీసీసీఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: