సాధారణంగా ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు ఆటగాళ్లు ఎంత అగ్ర సీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తమ జట్టును గెలిపించుకోవాలని ఆశతో కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థి ఆటగాళ్ల  ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్లెడ్జింగ్ కు పాల్పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఎవరైనా ఆటగాళ్లు స్లెడ్జింగ్ కు పాల్పడినప్పుడు ఇరు జట్ల  ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే మైదానంలో ఎంత గొడవపడినా ఇక బయట మాత్రం మళ్లీ స్నేహితుల్లాగానే కలిసిపోతూ ఉంటారు ప్లేయర్లు.


 అయితే భారత జట్టులో మిగతా ఆటగాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ ఎప్పుడూ రెడ్ బుల్ తాగినట్లుగా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే విరాట్ కోహ్లీ మాత్రం కొన్ని కొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కవ్వింపులకు  పాల్పడటం చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే 2015 వరల్డ్ కప్ సమయంలో విరాట్ కోహ్లీ తనను స్లెడ్జింగ్ చేశాడు పాకిస్తాన్ వెటరన్ ఫేసర్ సోహెల్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమయంలో విరాట్ కోహ్లీకి తాను గట్టిగానే సమాధానం చెప్పాను అంటూ ఇటీవల తెలిపాడు. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా 43వ ఓవర్లో సోహైల్ ఖాన్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు.


 ఇక ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందట. అప్పుడే నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చాను. ఆ సమయంలో విరాట్ నా దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడే వచ్చావు. కాస్త అతిగా మాట్లాడుతున్నావ్ ఏంటి అంటూ కవ్వింపులకు పాల్పడ్డాడు. అదే సమయంలో నేను గట్టిగానే ప్రతిస్పందించాను. బాబు భారత్ కోసం నువ్వు అండర్-19 ఆడేటప్పుడు.. నేను టెస్ట్ ప్లేయర్ ను అంటూ సమాధానం చెప్పా. ఇక అదే సమయంలో కెప్టెన్ గా ఉన్న మిస్బా కలగజేసుకొని నా వైపు ఆగ్రహంగా చూశాడు. నిశ్శబ్దంగా ఉండు అంటూ సైగ చేశాడు అంటూ సోహైల్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో 76 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: