
అయితే కేవలం తన ఆట తీరుతోనే కాదు తన లవ్ రిలేషన్షిప్ తో కూడా ఆటగాడు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుభమన్ గిల్ ప్రేమలో ఉన్నాడు అని ఎన్నో వార్తలు ఎన్నో రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక మరోవైపు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడని మరికొన్ని వార్తలు కూడా తెరమీదకి వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది మాత్రం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియదు అని చెప్పాలి.
ఇదిలా ఉంటే ఇటీవలే శుభమన్ గిల్ తనకిష్టమైన సెలబ్రిటీ ఎవరు.. తన క్రష్ ఎవరు అన్న విషయాన్ని చెప్పి అభిమానులందరికీ కూడా ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు అనే ఒక నెటిజన్ ప్రశ్నించాడు. అయితే టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన క్రష్ అంటూ గిల్ సమాధానం చెప్పడం గమనార్హం. అయితే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ పేరు చెబుతాడని అందరూ ఆశించినప్పటికీ ఇక గిల్ మాత్రం రష్మిక పేరు చెప్పడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.