విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చాలా ఆసక్తికరంగా సాగుతుంది.IPL లాగానే ఈ WPL కూడా చాలా మంచి క్రేజ్ తెచ్చుకోని దూసుకుపోతుంది. ఇంకా ఈ టోర్నీలో నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబై ఇండియన్స్ గెలుపొందడంతో పాయింట్ల పట్టికలో ముంబై జట్టు ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది.ఇక మొట్టమొదటి విమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 4 వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి మూడు రోజుల్లో మొత్తం నాలుగు మ్యాచులు జరిగాయి.ఇక ఈ విమెన్స్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ లో ఉన్నారు? ఇంకా అలాగే ఎవరు చిట్టచివరి స్థానంలో ఉన్నారు? వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇంకా అలాగే గుజరాత్ జెయింట్స్ ఇప్పటి దాకా రెండేసి మ్యాచులు ఆడాయి. మిగిలిన రెండు జట్లు ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ ఒక్కో మ్యాచ్ ని ఆడటం జరిగింది. 2 మ్యాచులు ఆడి రెండింటిలో కూడా గెలిచింది ముంబై ఇండియన్స్. దీంతో పాయింట్ల పట్టికలో మొత్తం 4 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క మ్యాచ్ ఆడి అందులో గెలిచింది. యూపీ వారియర్స్ కూడా ఒక్క మ్యాచ్ ఆడి అందులో గెలిచింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండడంతో 2 పాయింట్లతో ముంబై తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉంది.


యూపీ వారియర్స్ 2 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో కొనసాగుతోంది.ఇక ఆ తరువాత ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ రెండేసి మ్యాచులు ఆడి ఒక్క మ్యాచ్ కూడా ఆ జట్లు గెలవకపోవడంతో చివరి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ టీం రన్ రేట్ కంటే ఆర్సీబీ రన్ రేట్ కాస్త ఎక్కువ ఉంది. దీంతో ఆర్సీబీ నాలుగో స్థానంలో ఇంకా అలాగే గుజరాత్ టైటాన్స్ చిట్టచివరి (5వ స్థానంలో) స్థానంలో ఉన్నాయి. ఇక ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.మరి చూడాలి ఈ మ్యాచ్ ఎంత ఆసక్తికరంగా ఉండబోతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

WPL