
అయితే ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుంచే భారత్‌లో ఉన్న పిచ్ ల గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. తమకు అనుకూలంగా స్పిన్ పిచ్ లను తయారు చేసుకొని భారత్ గెలిచే ఛాన్స్ ఉందని ఆస్ట్రేలియా మాజీలు విమర్శలు చేయడం.. ఇందుకు భారత మాజీలు కౌంటర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఇండోర్ పిచ్ కి అటు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడం అయితే మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇక ఇప్పుడు నాలుగో మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ పిచ్ గురించి కూడా కొంతమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి.
ఇక ఇటీవల ఇదే విషయంపై భారత లెజెండరీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు ఎంతో ఫ్రెండ్లీగా కనిపిస్తుంది అంటూ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. తొలిరోజు భారత బౌలర్లు 4 టికెట్లు మాత్రమే తీశారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే ఇంతకు ముందు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ లలో కూడా ఆట కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. దీంతో పిచ్ లపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక క్యూరేటర్లు కూడా భయపడిపోయి 1970, 80 నాటి పిచ్‌లను తయారుచేసినట్టున్నారు అంటూ హాట్ కామెంట్స్ చేశాడు సంజయ్ మంజ్రేకర్.