ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కి సంబంధించి హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీ నుంచి కూడా 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మ్యాచ్ లతో బిజీగా ఉన్న ఆటగాళ్లు ఇక ఇప్పుడు ఐపీఎల్ కోసం భారత్లో అడుగుపెట్టి ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఇక ఐపిఎల్ పై మరింత ఆసక్తిని పెంచేందుకు ఆయా ఫ్రాంచైజీలు  కూడా వినూత్నంగా ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లను ఇంటర్వ్యూ చేస్తూ ఇక ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవలే అటు బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన స్నేహితుడు అయినా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏ బి డివిలియర్స్ నిర్వహిస్తున్న మిస్టర్ 360 షో కి అత్యధిక హాజరయ్యాడు. ఈ క్రమంలోనే ఎబి డివిలియర్స్ కోహ్లీని ఒక ఆసక్తికర ప్రశ్న అడిగాడు. నువ్వు చూసిన వారిలో వికెట్ల మధ్య ఫాస్ట్ గా పరిగెత్తే బెస్ట్ రన్నర్ ఎవరు అంటూ ఎబి డివిలియర్స్ ప్రశ్న అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు అటు విరాట్ కోహ్లీ నుంచి షాకింగ్ సమాధానం వచ్చింది అని చెప్పాలి. వికెట్ల మధ్య పరిగెత్తడం విషయంలో నా వరకు అయితే ఎంఎస్ ధోని కంటే ఏ బి డివిలియర్స్ బెస్ట్ రన్నర్ అని చెబుతాను. వాస్తవానికి ధోనీకి నాకు మంచి టెంపో ఉంటుంది. ఇక మహేంద్ర సింగ్ ధోనితో కలిసి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నేను సింగల్ కోసం ప్రత్యేకంగా కాల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. గుడ్డిగా కళ్ళు మూసుకొని పరిగెత్త వచ్చు. అంతలా టెంపో ఉంటుంది. అయితే వికెట్ల మధ్య పరిగెత్తడంలో మాత్రం ఎబి డివిలియర్స్ తర్వాతే ఎవరైనా అని ఖచ్చితంగా చెప్పగలను.. ఎందుకంటే అతను నా కంటే వేగంగా వికెట్ల మధ్య పరిగెడతాడు. కొన్నిసార్లు నేను కూడా అతనితో పరుగులు తీయడానికి వేగాన్ని అందుకోలేక అవుట్ అయిపోతానేమో అని భయపడే వాడిని అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: