పాకిస్తాన్ జట్టుకు ఎంతో బలమైన బౌలింగ్ లైనప్ ఉంది అన్నది ప్రపంచ క్రికెట్ విశ్లేషకులు చెప్పే మాట. ఇప్పటినుంచి కాదు ఇక పాకిస్తాన్లో క్రికెట్ ఆడటం మొదలైనప్పటి నుంచి కూడా ఎక్కువగా ఆ జట్టు బౌలర్ల పైన ఆధారపడుతూ వస్తుంది. బ్యాట్స్మెన్లు చేతులెత్తేసిన ప్రతిసారి కూడా బౌలర్లే తమ ప్రతిభను చాటి జట్టును గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లలో అటు పాకిస్తాన్ కు చెందిన బౌలర్ల పేరు కూడా మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మంచి ప్రదర్శన చేస్తూ రికార్డులు బద్దలు కొడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు అటు ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ఆడుతుంది. కాగా ఇటీవల పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మొదటిసారి ఓటమి చవిచూసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న పాకిస్తాన్.. ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ లో మాత్రం 66 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో మొదటి రెండు మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ ఇక క్లీన్ స్లీప్ అవ్వకుండా తప్పించుకుంది అని చెప్పాలి. తొలత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఇక ఆ తర్వాత లక్ష్య చేదన కోసం బరిలోకి  దిగిన ఆఫ్ఘనిస్తాన్ చెట్టు 116 పరుగులకే కుప్ప కూలిపోయింది అని చెప్పాలి.


 ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినప్పటికీ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇకపోతే మూడో టి20 మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవగా.. ఇక ఆ జట్టు స్టార్ బౌలర్ షాదబ్ ఖాన్ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టి20లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 10 ఓవర్ లో ఇబ్రహీం జడ్రాన్ ను అవుట్ చేసిన తర్వాత షాదాబ్ ఇక రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు 87 మ్యాచ్ లు ఆడిన షాదాబ్ 101 వికెట్లు పడగొట్టాడు. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది 98 వికెట్ల రికార్డును అధిగమించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: