ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కి మొదటి అడుగులోనే చేదు అనుభవం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభం మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ తో తలబడింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. తప్పకుండా ధోని సారథ్యంలోని చెన్నై విజయం సాధిస్తుందని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేసింది సీఎస్కే టీం. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ పై హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘన విజయాన్ని సాధించింది.


 ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అందరూ కూడా తేలిపోయారు అని చెప్పాలి. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అదే సమయంలో ఇక శుభమన్ గిల్ సూపర్ సెంచరీ తో మెరవడంతో గుజరాత్ కి భారీ స్కోర్ వచ్చింది. అయితే చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే రుతురాజ్  గైక్వాడ్ మినహా మిగిలిన ఎవరూ కూడా పెద్దగా రానించింది లేదు. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకొని 16.25 కోట్ల రూపాయల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్ జట్టుకు ఎక్కడ ఉపయోగపడలేదు అని చెప్పాలి. బెన్ స్టోక్స్ ఆల్ రౌండర్ కావడంతో బ్యాటింగ్ బౌలింగ్లో కూడా జట్టుకు అక్కరకు వస్తాడని అతన్ని ధర గురించి ఆలోచించకుండా కొనుగోలు చేసింది. కానీ తొలి మ్యాచ్లో మాత్రం అతను ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్లో నాలుగో స్థానంలో వచ్చి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయాడు అని చెప్పాలి. అదే సమయంలో ఫీల్డింగ్ లో కూడా పెద్దగా చురుకుగా కనిపించలేదు. ఏదో పోగొట్టుకున్నట్లుగా నిరుత్సాహంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కొన్ని మిస్ ఫీల్డ్ లు  కూడా చేశాడు అని చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే తొలి మ్యాచ్లో బెన్ స్టోక్స్ 16.25 కోట్ల ప్లేయర్ లాగా కాదు 20 లక్షల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్ లాగా కూడా ఆడలేదు అని చెప్పాలి.  దీంతో ఇక అతని ఆట తీరుపై అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl