ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇక ఇప్పుడు లీగ్ మ్యాచ్లు దగ్గర పడుతున్న కొద్దీ ఐపీఎల్ పోరు మరింత రంజుగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో వారంలోకి అడుగు పెట్టింది. గత వారం జరిగిన అన్ని మ్యాచ్ లు కూడా అసలు సిసలైన క్రికెట్ మజాను అందించాయి. మూడో వారంలో మొదటి రోజే అటు ఒక ఆసక్తికరమైన పోరు జరగబోతుంది అని చెప్పాలి. ఏకంగా రెండు బడా జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగబోతుంది.



 చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. అటు ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుండగా డూప్లెసెస్ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బరిలోకి దిగబోతుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ వారి చివరి మ్యాచ్ లో ఓడిపోగా..  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం వారి చివరి మ్యాచ్లో గెలిచే జోరు మీద ఉంది. అయితే ఇక బెంగుళూరు జట్టుకు హోం గ్రౌండ్ గా పిలుచుకునే చిన్న స్వామీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలబడబోతున్నాయి అని చెప్పాలి.



 అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది. అదే సమయంలో గత మ్యాచ్లో గెలిచిన బెంగళూరు జట్టు ఇక హోమ్ గ్రౌండ్ లో మరోసారి సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఇక ఈ రెండు బడా జట్ల మధ్య మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరగడం ఖాయం అన్నది తెలుస్తుంది. ఇకపోతే ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్ కోసం అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl