మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూ ఉన్నాడు అంటే చాలు ఇక స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్ ఎంత అప్రమత్తంగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే కాదు ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కి ఈ విషయం బాగా తెలుసు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని స్టంప్ అవుట్ చేసి పెవీలియన్ పంపిస్తాడు అన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు అయ్యింది కూడా. అందుకే ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అంటే స్టార్ బ్యాట్స్మెన్లు అయినా సరే కాస్త భయపడుతూనే బ్యాటింగ్ చేయడం చూస్తూ ఉంటాం.



 కానీ ధోని ఇలా వికెట్ల వెనకాల ఉన్నప్పుడు ఏదైనా బ్యాట్స్మెన్ కాస్త అతి చేశాడు అంటే ఇక వికెట్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ధోని తన కీపింగ్ స్మార్ట్ నెస్ ని మరోసారి చూపించాడు. మెరుపు వేగంతో స్టంప్ అవుట్లు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మొదట సూపర్ స్టంట్ అవుట్ తో మెరిసిన ధోని ఆఖరిలో వాషింగ్టన్ సుందర్ ను రనౌట్ చేసి అదరగొట్టాడు. అక్కడ వికెట్ కీపింగ్ చేస్తుంది మహేంద్రసింగ్ ధోని అన్న విషయం తెలిసినప్పటికీ వాషింగ్టన్ సుందర్ కాస్త తొందరపాటు చూపించాడు.



 ఇంతకీ ఏం జరిగిందంటే.. సన్రైజర్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతిని మార్కో జాన్సన్ మిస్ చేశాడు. అయితే ఒక్క పరుగుతో వచ్చేది ఏం లేదని అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ వికెట్ల వెనకాల ఉన్నది ధోని అని తెలిసి కూడా జాన్సన్ రిస్కు చేశాడు. ఫలితం నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న సుందర్ క్రీజు లోకి వచ్చే లోపు ధోని బంతితో డైరెక్ట్ హిట్ చేయడంతో వికెట్లు ఎగిరిపడ్డాయి. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన తర్వాత సుందరానికి బాగా తొందర ఎక్కువ బంతి ధోని చేతిలోకి వెళ్తే తప్పించుకోవడం కష్టమని తెలిసికూడా రిస్క్ చేశాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: