దీంతో ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని బీసీసీఐ.. అలా చేస్తే తాము కూడా వన్డే వరల్డ్ కప్ లో ఆడబోము అంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతుంది. దీంతో ఇక ఈ రెండు టోర్నిలలో ఈ రెండు జట్లను ఆడించేందుకు అటు ఐసీసీకి పెద్ద తలనొప్పిగా మారింది అని చెప్పాలి. అయితే భారత్ ఆడే మ్యాచ్లను పాకిస్తాన్లో కాకుండా యూఏఈ వేదికగా నిర్వహించాలని ఇప్పటికే చర్చలు జరిపింది ఐసిసి. కానీ ఈ చర్చలు ఫలించలేదు అన్నది మాత్రం తెలుస్తుంది.
ఎందుకంటే పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్ లో ఆడేందుకు భారత ప్లేయర్లను పంపించేందుకు బీసీసీఐ ఒప్పుకోవట్లేదు. అయితే టీమిండియా ఆడే మ్యాచ్ లను ఇతర వేదికలలో నిర్వహించేందుకు హైబ్రిడ్ మోడల్ ను తీసుకురాగా.. దీనిని కూడా అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి వ్యతిరేకించింది అన్నది తెలుస్తుంది. దీంతో ఆసియా కప్ జరుగుతుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆసియా కప్ ను రద్దుచేసి ఇక ఐదు దేశాలతో ఒక ప్రత్యేకమైన టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. అయితే ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను శాసిస్తుంది. దీంతో బీసీసీఐ ఏమనుకుంటే అది జరుగుతుంది అనడంలో సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి