టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎంతో గొప్ప వ్యూహకర్త అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో సమర్థవంతంగా  జట్టును ముందుకు నడిపిస్తూ ఇక భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించాడు మహేంద్రసింగ్ ధోని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పదునైన వ్యూహాలతో మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకోగల సమర్థుడు ధోని అని చెప్పాలి. క్లిష్ట సమయంలో కూడా చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యర్థిని భయపెడుతూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. వికెట్ల వెనకాల ఉండి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాడు అని చెప్పాలి.



 ఇక ఒక్కసారి ఒక బ్యాట్స్మెన్ ను అవుట్ చేయడానికి ధోనీ వ్యూహం పన్నాడు అంటే చాలు ఎంతటి బ్యాట్స్మెన్ అయినా సరే ధోని వ్యూహం నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ధోని ఎక్కడ ఫీల్డర్ ని సెట్ చేస్తాడో బ్యాట్స్మెన్ కావాలని కొట్టినట్లుగానే అతను చేతుల్లోకే బంతిని కొట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇలా ఈజీ క్యాచ్ ద్వారా వికెట్ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి.  ఇక ఇటీవల ipl లో భాగంగా మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో 15 పరుగులు తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోనే  పదో సారి ఫైనల్ లొ అడుగుపెట్టి రికార్డు సృష్టించింది అని చెప్పాలి.



 అయితే ఈ మ్యాచ్లో మహేంద్రసింగ్ ధోనీ వేసిన వ్యూహంలో చిక్కుకున్న గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది. గుజరాత్ ఇన్నింగ్ సమయంలో ఆరో ఓవర్ మహేష్ తీక్షణ వేశాడు. స్ట్రైక్ లో పాండ్యా ఉండడంతో.. ఇక అతని గురించి మొత్తం తెలిసిన ధోని ఫీల్డర్  ని సెట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆఫ్ సైడ్ లో జడేజాను ఉంచాడు ధోని. ఇక తీక్షణ వేసిన బంతిని పాండ్యా ఆఫ్ సైడ్ దిశగానే ఆడాడు. ఇక ఆ బంతి నేరుగా జడేజా చేతుల్లోకి వెళ్లి పడింది. దీంతో పాండ్యా నిరాశగా పెవిలియన్ చేరాడు.  ఇది చూసిన అభిమానులు.. ధోని ప్లాన్ వేసాక.. టార్గెట్ ఎలా మిస్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: