
అయితే భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మాత్రం లక్ష్యాన్ని చేదించలేకపోయింది. దీంతో ఓటమి తప్పలేదు. అయితే అటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగాన్ని దెబ్బతీసింది మాత్రం గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ అని చెప్పాలి. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అతని బౌలింగ్ దాటికీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేక మేడల కుప్ప కూలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో ఒకసరి కొత్త చరిత్ర సృష్టించాడు మోహిత్ శర్మ. 2.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన మోహిత్ శర్మ 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం.
అయితే ఐపీఎల్ లో 5 వికెట్లు తీయడం అనేది సర్వసాధారణమే అయినప్పటికీ ప్లే ఆఫ్ లాంటి కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం ఇలాంటి ప్రదర్శన చేయడం చాలా అరుదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ హిస్టరీలో ప్లే ఆఫ్స్ లో ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్గా మోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ముంబై బౌలర్ ఆకాష్ మద్వాల్ లక్నోతో జరిగిన మ్యాచ్లో ఐదు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక ఈ సీజన్లో డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కూడా మోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు మోహిత్ శర్మ 14 వికెట్లు తీయగా.. తొలి స్థానంలో చెన్నై బౌలర్ పతిరానా 16 వికెట్లతో ఉన్నాడు.