
అయితే ఇప్పుడు దేశవాలి క్రికెట్ లో ఎలాంటి ప్రదర్శన చేసిన పట్టించుకోవట్లేదు. కానీ అటు ఐపిఎల్ లో మాత్రం ఒక సీజన్లో మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు తర్వాత సీజన్ ప్రారంభం అయ్యేలోపే ఆ ఆటగాడు టీమిండియాలో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పుడు టీమిండియా తరఫున ఆడుతూ మంచి ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఒకప్పుడు ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన వారే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాగే మరో ఆటగాడికి అవకాశం దక్కింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యంగ్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ ఈ సీజన్లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అప్పటికే దేశవాళీ క్రికెట్లో తానేంటో నిరూపించుకున్న యశస్వి జైష్వాల్ ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని కూడా బాగా సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు మొత్తం విఫలమవుతున్నప్పటికీ అతను మాత్రం భారీ స్కోరు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో దుమ్మురేపిన ఈ యంగ్ బ్యాట్స్మెన్ ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఋతురాజ్ గైక్వాడ్ స్థానంలో జైష్వాల్ స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. జూన్ 3, 4 తేదీల్లో తన వివాహం ఉందని గైక్వాడ్ చెప్పడంతో ఇక అతడి స్థానంలో ఈ యంగ్ సెన్సేషన్ ప్లేయర్ ను తీసుకుందట బీసీసీఐ.