
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ కు ముందు అటు భారత జట్టుకు ఎన్నో ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ఎంతో మంది ప్లేయర్స్ గాయం బారినపడి జట్టుకు దూరమయ్యారు. దీంతో వారి ప్లేస్ లో కొత్తవారిని జట్టులోకి తీసుకోవడం అటు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అయితే టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగే రవిచంద్రన్ అశ్విన్ సైతం వెన్నునొప్పి కారణంగా క్రికెట్కు దూరమయ్యాడు.
అయితే అతను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ విషయంలో అటు భారత జట్టుకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. ఎందుకంటే భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెన్ను నొప్పి నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించాడట. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ లో రాజస్థాన్ తరఫున చివరి మ్యాచ్ ఆడలేకపోయాడు అశ్విన్. దీంతో డబ్ల్యూటీసి ఫైనల్ కు అందుబాటులో ఉండటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించి బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడట. దీంతో అతని రాకతో భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది.