చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎన్నో ఏళ్ల పాటు తమ జట్టుకు ప్రాతినిధ్యం  వహించిన ప్లేయర్లను పూర్తిగా వదులుకోకుండా ఇక ఏదో ఒక విధంగా తమతో అంటిపెట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దశాబ్ద కాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడి ఇక చెన్నై మూడు టైటిల్స్ గెలవడంలో కీలకపాత్ర వహించిన బ్రావో విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. గత ఏడాది ఐపీఎల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు బ్రావో.


 అయితే జట్టులో కీలక ఆటగాడైనా అతని సేవలను వదులుకునేందుకు ఇష్టపడని చెన్నై ఫ్రాంచైజి ఏకంగా అతనికి బౌలింగ్ కోచ్ గాను బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం బ్రావో కోచింగ్ లో చెన్నై బౌలింగ్ విభాగం ఎంతో అద్భుతంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చెన్నై జట్టుకి కోచ్గా రావడం గురించి బ్రావో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం చెన్నై జట్టు ముఖచిత్రమైన ధోని వల్లే ఇదంతా సాధ్యమైంది అంటూ చెప్పుకొచ్చాడు.


 విజయవంతమైన ఐపీఎల్ కెరియర్ కు గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించడం నా జీవితంలోనే విచారకరమైన సమయం. ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ ఐపీఎల్లో కొనసాగాలని నా నుదుటి రాతలో రాసిపెట్టి ఉన్నట్టుంది. మహేంద్ర సింగ్ ధోని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ నన్ను కోచ్ స్టాప్ లో భాగం చేసింది. ఇక నా క్రికెట్ కెరియర్ లో ముందుకు సాగేందుకు ఇదే సరైన దశ అనిపించింది అంటూ బ్రావో చెప్పుకొచ్చాడు. దేవుడు క్రికెటర్ గా నాకు ఇచ్చిన నైపుణ్యాన్ని ఎలా కొనసాగించాలని ఆలోచిస్తున్న సమయంలో కోచ్గా కొత్త అవతారం ఎత్తడం.. అది కూడా ఐపీఎల్ హిస్టరీలో సక్సెస్ఫుల్ టీం అయినా సీఎస్కే కోచ్ గా ఉండడం అంటే అద్భుతం అంటూ బ్రావో భావోద్వేగానికి గురయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl