సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు జనాలు. అంతేకాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ఇక ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తు ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో ఇక అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రపంచంలో జరిగిన ఘటనలు కూడా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయని చెప్పాలి. అయితే ఇలా వెలుగులోకి వచ్చే ఘటనలు కొన్ని కొన్ని సార్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్.


 ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనల్లో కొన్ని వింతైన ఘటనలు కూడా ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా భూమి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి అంటే భూకంపం వచ్చే ప్రమాదం ఉందేమో అని అందరూ భయపడిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ భూకంపం ఏమీ రావట్లేదు కానీ ఎందుకో భూమి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. దీంతో అసలు ఏం జరగబోతుంది.. ఏం జరుగుతుంది అన్నది అర్థం కాక ఇక ఆ ప్రాంతంలో నివసించే జనాలు మొత్తం భయాందోళనలోనే మునిగిపోయారు అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు కేరళ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. కొట్టాయం జిల్లా చిన్నపాడి ప్రజలు ఇక అక్కడ జరిగిన వింత ఘటనలతో వనికి  పోతున్నారు. ఏకంగా భూమి నుంచి వింత శబ్దాలు రావడంతో భయపడిపోతున్నారు. ఇలా భూమి నుంచి వింత శబ్దాలు వస్తుండడంతో ఏం జరగబోతుందో అనే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు అని చెప్పాలి. ఈ వారం ప్రారంభం నుంచే చిన్న పాడితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి వింత శబ్దాలు వినిపిస్తున్నాయట. ఉదయం రెండుసార్లు భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. త్వరలోనే సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ బృందం అక్కడ ప్రాంతానికి చేరుకుని ఇక వింత శబ్దాల మిస్టరీ పై స్పష్టత ఇస్తుందని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: