
ప్రతి మ్యాచ్ లో కూడా చెన్నై జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగాడు అని చెప్పాలి. ఇక కీలక సమయంలో వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహించాడు. దీంతో అతనిపై ప్రశంసలు కూడా కురిపించారు ఎంతోమంది మాజీ ఆటగాళ్లు. అయితే ఇలా ఐపిఎల్ లో రాణించిన ఆటగాళ్లకు వెంటనే అంతర్జాతీయ క్రికెట్లో ఛాన్స్ దక్కడం చూస్తూ ఉంటాం. పతీరణ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఐపీఎల్ లో బాగా రాణించిన పతిరణకు ఈ టోర్నీ ముగిసిందో లేదో అప్పుడే శ్రీలంక జట్టు తరపున వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అరంగేట్రం అయితే చేశాడు కానీ తన బౌలింగ్ తో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన శ్రీలంక బౌలర్ మతీషా పతీరణ బౌలింగ్ పై విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో అతడు 8.5 ఓవర్లు వేసి 66 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే ఒక వికెట్ తీసాడు. అయితే అతడు ఇచ్చిన 66 రన్స్ లో 16 ఎక్స్ ట్రా రన్స్ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో పతీరణ వన్డేలకు పనికిరాడు అని కొంతమంది అంటుంటే.. ధోనీ లేకపోతే పతీరణ రాణించలేడు అని మరి కొంత మంది విమర్శలు చేస్తున్నారు. మరి ఈ యంగ్ బౌలర్ తర్వాత మ్యాచ్‌లో ఎలా రానిస్తాడో చూడాలి.