
అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారు ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోయే ఓవల్ మైదానం అటు ఫేస్ పిచ్ అన్న విషయం విషయం తెలిసిందే. దీంతో ఎక్కువగా జట్టులో పేసర్లకే ఛాన్స్ దక్కనుంది. కేవలం ఒకే ఒక స్పిన్నర్ తో ఇరు జట్లు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది అని చెప్పాలి.
ఇక భారత జట్టులో ఇలా చోటు దక్కించుకోబోయే స్పిన్నర్ ఎవరు అనేదానిపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇదే విషయంపై ఆస్ట్రేలియా సహాయక కోచ్ డేనియల్ వెటోరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో స్పిన్నర్ అశ్విన్ ఆడకపోవచ్చు అంటూ డేనియల్ వేటోరి అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఫేస్ కి అనుకూలించే ఓవల్ లో ఇండియా ముగ్గురు ఫేసర్లతో పాటు ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కు తప్పకుండా తుది జట్టులో ఛాన్స్ దక్కుతుంది. ఇక నాలుగో ఫేసర్ గా శార్దూల్ ఠాకూర్ కి అవకాశం దక్కవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు డేనియల్ వెటోరి.