
కానీ ఇటీవలే తన రిటైర్మెంట్ గురించి ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. 2024 జనవరిలో తన సొంత మైదానమైన సిడ్నీలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇక ఈ మ్యాచ్ పాకిస్తాన్ తో జరగనుంది. ఇక ప్రస్తుతం జూన్ 7వ తేదీ నుంచి ఓవల్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వార్నర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో 2024 టీ20 వరల్డ్ కప్ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుంది ప్రకటన చేశాడు అని చెప్పాలి .
2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు వరకు 103 టెస్టులు ఆడాడు ఇందులో 25 శతకాలు 34 అర్ధ శతకాలు ఉన్నాయి. 142 వన్డే మ్యాచ్లు ఆడగా. 19 సెంచరీలు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 99 టి20 మ్యాచ్ ఆడగా.. ఒక సెంచరీ తో పాటు 24 అర్థ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే 36 ఏళ్ల డేవిడ్ వార్నర్ ఇటీవల కాలంలో టెస్ట్ ఫార్మాట్లో పెద్దగా రాణించడం లేదు. రెండేళ్ల వ్యవధిలో అతను ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం అతను పర్వాలేదనిపిస్తున్నాడు. ఇటీవల 2023 ఐపీఎల్ లో కూడా మంచి ప్రదర్శన చేశాడు.