ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. లండన్ లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు కూడా ఇప్పటికే ఇంగ్లాండు గడ్డపై అడుగు పెట్టి అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అయితే రెండు జట్లకు కూడా ఓవల్ మైదానం కొత్త వేదిక కావడంతో ఇక ఇరుజట్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే ఇరు జట్లకు కూడా హోమ్ గ్రౌండ్ కాకపోవడంతో రెండు జట్లు కూడా ఇక ప్రత్యర్థులను  ఎదుర్కొనేందుకు తీవ్రంగానే కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై అటు సోషల్ మీడియాలో చాలానే రివ్యూలు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు  ఈ విషయంపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇది విషయంపై ఆస్ట్రేలియా యంగ్ ఆల్రౌండర్ గ్రీన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 విరాట్ కోహ్లీ ఒక్కడే మ్యాచ్ ని గెలిపిస్తాడు అంటూ కామరూన్ గ్రీన్ వ్యాఖ్యానించాడు. సాధారణంగా ఆస్ట్రేలియా తో మ్యాచ్ ఉంటే చాలు కోహ్లీ రెచ్చిపోతాడు. ఇక ఆస్ట్రేలియాపై ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ కూడా ఒకడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై 24 మ్యాచ్ లలో 48.26 సగటుతో 1979 పరుగులు చేశాడు కోహ్లీ. ఐపీఎల్ లో సూపర్ ఫామ్ లో కనిపించాడు. ఇదే విషయంపై కామరూన్ గ్రీన్ మాట్లాడుతూ.. ఏదైనా బిగ్ స్టేజ్ లో కోహ్లీ రెచ్చిపోతాడని నా నమ్మకం.. డబ్ల్యూటీసి ఫైనల్ కూడా పెద్ద వేదిక. కనుక ఈ మ్యాచ్లో గట్టిగా టీమిండియాను గెలిపించగలడు అంటూ కామరూన్ గ్రీన్  అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: