సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ నడిచినట్లుగానే అటు క్రికెట్లో కూడా ఇలా ఎప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ ప్రస్తుత స్టార్ క్రికెటర్ల నుంచి ఇక మాజీ ఆటగాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఇప్పుడు క్రికెట్ లో ప్లేయింగ్ ఎలవెన్  టీం ట్రెండ్ కొనసాగుతుంది. అదేంటి ప్లేయింగ్ ఎలిమెంట్ టీం ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా.. అయితే ప్రస్తుతం మాజీ ప్లేయర్స్ అందరూ కూడా ఈ ట్రెండ్ ని బాగా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ప్లేయింగ్ 11 ట్రెండ్ అంటే ఏంటో తెలుసా.. అంతర్జాతీయ క్రికెట్ లో ఏదైనా కీలకమైన మ్యాచ్ జరిగిందంటే చాలు.. ఇక ఆ మ్యాచ్ లో తమ అభిమాన జట్టులో ఉండే.. 11 మంది ఆటగాళ్లు ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై ఇక ముందుగానే ఒక అంచనాకు వస్తున్నారు మాజీ ప్లేయర్స్.


 దీంతో సెలెక్టర్లు ఎవరిని సెలెక్ట్ చేస్తే మాకెందుకు అనుకుని భావించి.. ముందుగా తమ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటిస్తున్నారు. ఇక ఇలా మాజీ ప్లేయర్స్ ప్రకటించిన ప్లేయింగ్ 11 టీమ్స్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఇలా ఎంతో మంది మాజీ ప్లేయర్స్ ఇప్పటికే ప్లేయింగ్ ప్రకటించారు అని చెప్పాలి. తుది జట్టులో ఇక తాము అనుకున్న ఆటగాళ్లు ఉంటే తప్పకుండా టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు ఇటీవల ఇదే విషయంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.


 అందరిలాగానే అతను కూడా ట్రెండ్ ఫాలో అయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్  ఫైనల్ మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. కాగా ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించిన ప్లేయింగ్ 11 టీం వివరాలు చూసుకుంటే..

 కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, పూజార కోహ్లీ, రహానే, ఇషాన్ కిషన్, జడేజా, అశ్విన్ లేదా శార్దూల్ ఠాగూర్, సిరాజ్ ఉమేష్ యాదవ్, షమీలను తన ప్లేయింగ్ జట్టులో చేర్చుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. కాగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగబోతుంది. మరి తుదిజట్టులో ఎవరుంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: