
దీంతో ఇలా ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకుంటున్న యువతీ యువకులను చూస్తుంటే వీళ్ళు నిజంగానే ప్రేమికుల లేకపోతే బద్ద శత్రువుల అన్న విషయం కూడా అర్థం కాక అందరూ కన్ఫ్యూజన్లో మునిగిపోతున్నారు. అయితే ఇప్పుడు వరకు ఇలా మోసం చేసింది అన్న కారణంతో ఎంతోమంది అమ్మాయిలపై అబ్బాయిలు దారుణంగా దాడి చేసిన ఘటనల గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం అంత సీన్ రివర్స్ అయింది. ఒక యువతి తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన బీహార్ లోని పాట్నాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
తనను రహస్యంగా వివాహం చేసుకొని మరో యువతి తో పెళ్లికి సిద్ధమయ్యాడు అని తెలిసి సదరు యువతి ఇక ఈ దుశ్చర్యకు పాల్పడింది అని చెప్పాలి. చతిస్గఢ్ లో సిఆర్పిఎఫ్ జపాన్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు బాధితుడు. అయితే బంధువుల అమ్మాయితో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల ఎవరికి తెలియకుండా రహస్యంగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని దాచి ఇక మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు యువకుడు. ఈ విషయం ప్రియురాలికీ తెలిసింది. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ప్రియుడిని పాట్నాలోని ఒక హోటలకు రప్పించి ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో ప్రియుడు మర్మంగాని కోసేసింది. పోలీసులు యువతిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.