
ఈ క్రమంలోనే టీమిండియా మంచి ప్రదర్శన చేసి గెలుస్తుంది అన్న నమ్మకం మాత్రం ఎవరిలో కనిపించడం లేదు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి అటు టీమిండియా 296 పరుగుల వెనుకబడి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా ఆట తీరుపై మాజీ ఆటగాళ్లందరూ కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేసి నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా చేతులు ఎత్తడం ఎన్నో రోజుల నుంచి జరుగుతూనే వస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇక ఇటీవలే జరిగిన మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజార అవుట్ అయిన విధానం పై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టెస్ట్ ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న పూజార అవుట్ అయిన విధానంపై రవి శాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై ఏ బంతిని వదిలేయాలో తెలియడంతోపాటు ఆఫ్ స్టాంప్ ఎక్కడుందో గుర్తు పెట్టుకోవాలి. ఫుట్ వర్క్ విషయంలో గిల్ కాస్త బద్ధకంగా కనిపించాడు. అతను అంటే కుర్రాడు ఇంకా నేర్చుకుంటున్నాడు.. పూజార నీకు ఏమైంది. పూజారా బంతిని వదిలేయడంతో నేరుగా వికెట్లను తాకింది. ఇక ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాను అంటూ రవి శాస్త్రం చెప్పుకొచ్చాడు.