
అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఎక్కడ చూసినా టెస్ట్ ఫార్మాట్ కి సంబంధించిన చర్చే జరుగుతుంది. టెస్ట్ ఫార్మాట్లో అత్యుత్తమ రికార్డులు సాధించిన ప్లేయర్లు ఎవరు.. టెస్ట్ ఫార్మాట్ కి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి గల తేడా ఏంటి అనే విషయం పైన ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇక పలు ఇంటర్వ్యూలలో తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి . ఈ క్రమంలోనే ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న వేళ టెస్ట్ ఫార్మాట్ గురించి లెజెండ్స్ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్ టెస్ట్ ఫార్మాట్ కి అసలైన అర్థం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. టెస్ట్ ఫార్మాట్ అంటే బౌలర్లకు బ్యాట్స్మెన్ లకు మధ్య మానసికంగా శారీరకంగా జరిగే సమరం.. సెషన్ల వారిగా సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ ఫార్మాటే అత్యుత్తమం అంటూ అటు రవి శాస్త్ర, రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ ఫార్మాట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ తెలిపాడు.