అయితే ఈ ఏడాది మొత్తం అటు టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. అదే సమయంలో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి కీలకమైన మెగా టోర్నిలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది భారత సెలక్షన్ కమిటీ. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇక జట్టులోని సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు బిసిసిఐ సేలెక్టర్లు నిర్ణయించారు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో రాణించిన యువ ఆటగాళ్లకు కూడా చోటు కల్పించాలని భావిస్తున్నారట.
కాగా ఈనెల 27వ తేదీన ఇక వెస్టిండీస్ టూర్కు టీమ్ ఇండియా ఎంపిక జరగబోతుంది అనేది తెలుస్తుంది. రోహిత్, విరాట్ కోహ్లీలకు వన్డే టి20 సిరీస్ లకు శమీ సిరాజ్ లకు వెస్టిండీస్ టూర్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక వీరి స్థానంలో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్, యశస్వి జైస్వాల్, అర్షదీప్ లను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారట. మరోవైపు హార్దిక్ పాండ్యా టెస్టులలో కూడా ఆడతానని చెబితే ఇక అతన్ని మూడు ఫార్మట్ల లో కూడా భాగం చేసే అవకాశం ఉంది. అయితే ఎన్నో రోజుల గ్యాప్ తర్వాత సంజూ శాంసన్ కు మళ్ళి జట్టులో చోటు దక్కుతూ ఉండడంతో అభిమానులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి