ఇక టీమిండియా చెత్త ప్రదర్శన నేపథ్యంలో జట్టులో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో ఇక సుదీర్ఘమైన ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న అశ్విన్ ను పక్కన పెట్టడం ఏంటి అని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు అని చెప్పాలి. ఏది ఏమైనా ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా పై మాత్రం ఇక ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ వ్యంగ్ సర్కార్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
టీమ్ ఇండియా సెలెక్టర్లకు క్రికెట్ పై అవగాహన.. ముందు చూపు లేనట్లు అనిపిస్తుంది అంటూ మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కొన్ని సిరీస్ లలో ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు శిఖర్ ధావన్ కు కెప్టెన్సీ అప్పగించారు. అదే వారు చేసిన తప్పు. యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ అప్పగించాల్సింది. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత ఇక తదుపరి కెప్టెన్ ను తయారు చేయడంలో అటు బీసీసీఐ విఫలం అయింది. కోట్ల సంపాదన గురించే ఆలోచించడం కాదు.. అటు జట్టు కూర్పు విషయంలో కూడా దృష్టి పెట్టాలి అంటూ వెంగ్ సర్కార్ చురకలు అంటించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి