అయితే అన్యోన్యతకు చిరునామాగా ఉన్న భార్యాభర్తల బంధం లో నేటి రోజుల్లో ఆ అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇక భార్య భర్తలు బద్ధ శత్రువులుగా మారిపోయి ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాం. ఏకంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. మరి కొంతమంది కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్.
ఇటీవల వరంగల్లోని కరీమాబాదులో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడం లేదు అనే కారణంతో భర్త సతీష్ చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిసి ప్రవర్తన మార్చుకోవాలని చెప్పాడు సతీష్. అయినప్పటికీ భార్య తీరులో మార్పు రాలేదు. దీంతో ఎంతగానో మనస్థాపం చెందాడు. ఇక భార్య పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి రావడం లేదని.. పిల్లలను కూడా తన వద్దకు పంపడం లేదని మనస్థాపానికి గురై చివరికి ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇక తన చావుకు భార్య అత్త మామ కారణం అంటూ ఇక సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి