దీంతో ప్రధాన ప్లేయర్లు లేకుండానే ఆయా జట్లు బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరికొన్ని జట్లకు ఏకంగా కెప్టెన్లు దూరం అవుతూ ఉండడం గమనార్హం. బంగ్లాదేశ్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది అని చెప్పాలి. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇక అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్న సమయంలో ఇక ఆ జట్టు వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్న తమిమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ కి ముందు తమ జట్టుకి కొత్త కెప్టెన్ వెతుక్కోవాల్సిన తలనొప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మొదలైంది.
అయితే కొత్త కెప్టెన్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ కి షకిబ్ అల్ హసన్ కెప్టెన్గా వ్యవహరించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపాడు. కాగా ఈనెల చివర్లో ప్రారంభమై ఆసియా కప్ కి కూడా షాకిబ్ అల్ హసన్ సారధ్య బాధ్యతలను భుజాన వేసుకునే అవకాశం ఉంది. కాగా నేడు ఆసియా కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి