
ఇంకేముంది సింహం ఒక్క పంజా విసిరి గ్రామసింహం ప్రాణాలు గాల్లో కలిపేస్తుంది. ఆ తర్వాత దాన్ని మాంసాన్ని తిని కడుపు నింపుకుంటుంది అని సమాధానం చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా ఒక భారీ సింహాన్ని గ్రామ సింహమే ఏకంగా పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అటు నైటిజన్స్ అందరు కూడా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. తాము ఉన్న ప్రాంతంలోకి ఎవరిని రానివ్వని వీధి కుక్కలు సింహం విషయంలో కూడా ఇదే రూల్ ని ఫాలో అయ్యాయి. దారి తప్పిందో ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ ఒక భారీ సింహం ఏకంగా జనావాసాల్లోకి వచ్చింది.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఏ ప్లేస్ అయితే ఏంటి అంతా నా సామ్రాజ్యమే అన్నట్లు సింహం ఎంతో దర్జాగా నడుచుకుంటూ వెళుతుంది. అయితే అంతలోనే నాలుగు కుక్కలు ఆ సింహం వెంట పడ్డాయి. దీంతో పరుగో పరుగు అన్నట్లుగా సింహం అక్కడి నుంచి పారిపోయింది. అయితే వీధి కుక్కలు వదల్లేదు. ఏకంగా చివరి వరకు వెంటపడి తరిమి తరిమి కొట్టాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక ఇందుకు కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా తోడవడంతో ఈ వీడియో చూసి నేటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.