దీంతో హైబ్రిడ్ మోడల్ లో శ్రీలంక వేదికగా మ్యాచ్ లు నిర్వహించాలని భావించిన.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. యూఏఈ లో మ్యాచ్ లు ఎందుకు నిర్వహించలేదు అన్న ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో జరగాల్సిన ఆసియా కప్ 2018, వరల్డ్ కప్ 2021, శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ 2022 టోర్నికి యూఏఈ వేదికగా మారింది. ఎలాంటి అంతరాయం లేకుండానే అక్కడ మ్యాచులు జరిగాయి అని చెప్పాలి. అయితే 2023 ఆసియా కప్ టోర్నీ కోసం యూఏఈ ని పాక్ క్రికెట్ బోర్డు ప్రస్తావించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎందుకు పట్టించుకోలేదు అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇదే విషయం గురించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులు జై షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎసిసి ప్రెసిడెంట్ గా ఉన్న నేను అందరికీ ఆమోద్య యోగ్యమైన హైబ్రిడ్ మోడల్ తీసుకురావాలని అనుకున్నా. అందుకే పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన చేయగానే మేము అంగీకరించాము. పాక్ క్రికెట్ బోర్డులో కూడా మేనేజ్మెంట్ చాలా సార్లు మారింది. ఆసియా కప్ 2002 ఎడిషన్ యూఏఈ లో టి20 ఫార్మాట్లో నిర్వహించారు. అయితే టి20 ఫార్మాట్ వన్డే ఫార్మాట్ ఒకటి కాదు. యూఏఈ లో ఉన్న వేడికి 100 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండటం అసాధ్యం అని మిగిలిన క్రికెట్ బోర్డులు భావించాయి. అదే కాకుండా వన్డే వరల్డ్ కప్ టోర్నకి ముందు ప్లేయర్లు గాయపడే అవకాశం కూడా ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అందుకే ప్లేయర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యూఏఈ లో కాకుండా శ్రీలంకలో మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఉపఖండంలో మ్యాచ్ లు నిర్వహించడం వల్ల ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి