అయితే ఇదే విషయం గురించి ఇంకా గౌతమ్ గంభీర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడని.. మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ను పక్కన పెట్టవద్దు అంటూ సూచించాడు. అలా అయితే రాహుల్ కోసం కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా పక్కన పెడతారా అంటూ ప్రశ్నించాడు గౌతం గంభీర్. అయితే రాహుల్ రాకతో ఇషాన్ కిషన్ ను జట్టు నుంచి తప్పిస్తారని ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ఇదే విషయంపై మాట్లాడాడు. ఆటగాళ్ల పేర్ల కన్నా ఫామ్ ఎంతో ముఖ్యం అంటూ తెలిపాడు.
జట్టు కోసం ఎంత కష్టపడాలో ఇషాన్ కిషన్ అంతకంటే ఎక్కువగా శ్రమిస్తున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదని ఇషాన్ కిషన్కు బదులు కేఎల్ రాహుల్ను ఆడనిస్తామనడం సరికాదు. ఒకవేళ కోహ్లీ లేదంటే రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ స్థానంలో ఆడి ఉంటే కేఎల్ రాహుల్ కోసం వారిని పక్కన పెట్టేవారా అంటూ ప్రశ్నించాడు గంభీర్. భారత్ టైటిల్ గెలవడం ముఖ్యం. కానీ ఇందుకోసం ఆటగాళ్ల ఫామ్ ముఖ్యమా.. ప్లేయర్ల పేర్లు ముఖ్యమా అంటూ ప్రశ్నించాడు. టీంకు ప్రపంచకప్ అందించగల సత్తా ఉన్న ఆటగాడివైపే మనం మొగ్గు చూపాలి అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి