అయితే అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభం కావాల్సి ఉండగా.. అంతకుముందు కొన్ని రోజులనుంచే అటు వరల్డ్ కప్ లో భాగంగా కొన్ని టీమ్స్ వార్మప్ మాచ్లు ఆడబోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 29వ తేదీన హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య వర్మప్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి. అయితే భారత్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య అది వార్మప్ మ్యాచ్ అని తెలిసినప్పటికీ ప్రేక్షకులు అటు స్టేడియం కి భారీగా తరలి వస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్లో జరిగే వారం మ్యాచ్ కి కూడా ప్రేక్షకులు ఇలాగే స్టేడియం కు వచ్చి మ్యాచ్ వీక్షించాలని ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఇక ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది అన్నది తెలుస్తుంది.
ఎందుకంటే వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరగబోతున్న పాకిస్తాన్, న్యూజిలాండ్ వారం మ్యాచ్ చూసేందుకు అభిమానులకు అనుమతి లేనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీన హైదరాబాద్ వ్యాప్తంగా గణనాథుల నిమర్జనం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులు ఆ ఈవెంట్లో బిజీగా ఉండనున్నారు. ఈ క్రమంలోనే భద్రతా కారణాల దృశ్య ఇక స్టేడియం మూసివేసి కేవలం ఆటగాళ్లతో ప్రేక్షకులు ఎవరూ లేకుండానే వార్మప్ మ్యాచ్ నిర్వహించనున్నారని క్రికెట్ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయం తెలిసి హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి