
వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇలా జట్టులోకి వచ్చి ఏకంగా త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోయిన ఆటగాడు శుభమన్ గిల్. అతని ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో ఓపెనర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక భారత జట్టు ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడిన తుది జట్టులో మాత్రం శుభమన్ గిల్ పేరు తప్పక కనిపిస్తోంది. మొన్నటికి మొన్న అటు ఆసియా కప్ లో కూడా మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబే వరల్డ్ కప్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేయడం ఖాయం అన్నది అందరూ అనుకుంటున్న మాట. ఇదే విషయం గురించి గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను వరల్డ్ కప్ గెలవాలని 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అనుకున్నాను అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. 2011లో భారత్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న సమయంలో నాకు 11 ఏళ్ళు ఉంటాయి. ఆ రోజే ఎప్పటికైనా ఈ ట్రోఫీని గెలిచి దానిని ఎత్తాలని నేను ఫిక్స్ అయ్యాను. అదే పట్టుదలతో ముందుకు సాగాను అంటూ గిల్ ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే గిల్ కన్న కలలు నెరవేరాలని.. ప్రపంచ కప్ ను ఇండియా తప్పకుండా గెలుస్తుంది అంటూ అటు అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది.