వరల్డ్కప్ కి కొన్ని నెలల ముందు నుంచి కూడా టీం ఎంపిక విషయంలో భారత సెలక్టర్లు ఎంతో క్లారిటీతో ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. జట్టుకు ఎవరైతే అవసరమని అనుకుంటున్నారో వారిని మాత్రమే టీమ్ లోకి తీసుకుంటున్నారు. ఇక అనవసరం అనుకున్న వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అవసరం లేని ఆటగాళ్లకు ఛాన్సులు ఇచ్చి చేతులు కాల్చుకోవాలని అస్సలు అనుకోవట్లేదు సెలెక్టర్లు. ఇక జట్టులో ఉన్న ప్లేయర్లలో ఎవరైనా ఆటగాడు సరైన ప్రదర్శన చేయలేదు అంటే వారిని పక్కన పెట్టి మరొకరితో వారి ప్లేస్ ని రీప్లేస్ చేయడం చేస్తూ ఉన్నారూ.


 ఈ క్రమంలోనే ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ గాయపడగానే అతని ప్లేసులోకి అర్జెంటుగా వాషింగ్టన్ సుందర్ ని తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను బీసీసిఐ ప్రకటించింది. అయితే అక్షర్ పటేల్ గాయపడటంతో ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ కోసం అశ్విన్ ను జట్టులోకి తీసుకుంది సెలెక్షన్ కమిటీ. ఒకవేళ అశ్విన్ గనక బాగా ఆడితే అతన్ని వరల్డ్ కప్ లోకి ఎంపిక చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అక్షర్ పటేల్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోతేనే ఇది జరుగుతుంది.



 అయితే అశ్విన్ లాంటి ఒక అనుభవజ్ఞుడైన బౌలర్ టీం లో ఉండడం జట్టుకు ఎంతో ప్లస్ పాయింట్ అవుతుందని సెలెక్టర్లు కూడా భావిస్తున్నారట. అశ్విన్ను టీమ్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. అయితే అక్షర్ పటేల్ ఫిట్నెస్ సాధించే ఛాన్సులు తక్కువగా ఉన్నాయి. అతని స్థానంలో జట్టులోకి తీసుకున్న వాషింగ్టన్ సుందర్ పెద్దగా రాణించట్లేదు. దీంతో అశ్విన్ లాంటి సీనియర్నే జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని.. కెప్టెన్ రోహిత్ తో పాటు కోచ్ ద్రావిడ్ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: