ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ ను హై వోల్టేజ్ మ్యాచ్ గా పిలుచుకుంటూ ఉంటారు అందరూ. అయితే ఈ ఏడాది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కి ఒక్కసారి కాదు ఏకంగా ఎక్కువ సార్లు చూసే అవకాశాన్ని అటు ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులు దక్కించుకుంటున్నారు. మొన్నటికీ మొన్న ఆసియా కప్ లో భాగంగా రెండుసార్లు ఈ దాయాదుల సమరం జరిగింది. ఒకసారి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే మరోసారి మాత్రం టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు మూడోసారి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే మూడోసారి అనగానే వరల్డ్ కప్ లో అనుకునేరు. వరల్డ్ కప్ లో కాకుండానే ఈ దాయాదుల పోరు జరగబోతుంది. అయితే ఈసారి తలబడేది మెన్స్ టీం కాదు ఉమెన్స్ టీం. చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్.. 2023లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక బంగ్లాదేశ్ మెన్స్ టీంలు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు సెప్టెంబర్ 24వ తేదీన బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, పాకిస్తాన్ మధ్య సెమి ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ఒకవేళ రెండు మ్యాచ్ లలో ప్రత్యర్ధులపై భారత్, పాకిస్తాన్ ఉమెన్స్ టీమ్స్ గెలిస్తే.. దాయాదులైన భారత్, పాకిస్తాన్ మరోసారి ఫైనల్ లో ముఖాముఖి తలబడతాయి అని చెప్పాలి.


 ఈ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 25వ తేదీన జరగబోతుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు బంగారు పతకం ఓడిన జట్టుకు రచట పథకం సొంతమవుతుంది. అయితే సెమీఫైనల్ లో ఓడిన జట్లు కాంస్య పథకంతో సరిపెట్టుకుంటాయి అని చెప్పాలి. ఇక మరోవైపు ఆసియా క్రికెట్ గేమ్స్ మెన్స్ టీమ్ లో కూడా భారత్ మెన్స్ టీం..  గ్రూప్ స్టేజిలో గెలిచిన జట్టు అక్టోబర్ మూడవ తేదీని తలబడబోతుంది. కాగా ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడుతున్న మెన్స్ టీమ్ జట్టుకు ఋతురాజ్ కైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: