అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ప్రపంచ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే సొంత గడ్డమీద జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో అటు టీమిండియా పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక అంతకుముందే అటు వరుసగా వన్డే ఫార్మాట్లో సిరీస్ లు ఆడుతుంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ లో భాగంగా టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే  ఇటీవల సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది.


 ఈ వన్డే సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా మూడు మ్యాచ్ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది అని చెప్పాలి. అయితే ఈ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత చివరి మ్యాచ్ కి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలను తీసుకున్నాడు. అయితే కేఎల్ రాహుల్ సారథ్యంలో ఆడిన రెండు మ్యాచ్లలో టీమిండియా గెలిస్తే.. రోహిత్ కెప్టెన్సీలో ఆడిన చివరి మ్యాచ్లో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం సిరీస్ ట్రోఫీ అందుకోవడానికి రోహిత్ శర్మ నిరాకరించాడు. రెండు మ్యాచ్లలో జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్ ను పిలిపించి మరీ ట్రోఫీ అతని చేతికి అందించాడు. కాగా రోహిత్ చేసిన పనికి అభిమానులు అభినందిస్తున్నారు అని చెప్పాలి.



 అయితే మొదటి రెండు మ్యాచ్లలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు ఇక మూడో వన్డే కి వీళ్ళందరూ కూడా వచ్చారు అన్న విషయం తెలిసిందే అయితే ఇక ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియా ఇప్పుడు వరల్డ్ కప్ కూడా గెలవడం ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు ఆసియా కప్ లో గెలిచి కాన్ఫరెన్స్ పెంచుకున్న టీమిండియా పటిష్టమైన ఆస్ట్రేలియాపై సొంత గడ్డపై సిరీస్ గెలుచుకొని మరింత ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్లో దిగబోతుందని అందరూ భావిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: