ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మహా సంగ్రామం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ ప్రపంచకప్ లో 10 టీమ్స్ పాల్గొనబోతున్నాయ్ అని చెప్పాలి. వరల్డ్ కప్ కి సమయం ఆసన్నమైన నేపథ్యంలో 10 టీమ్స్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టాయి. ప్రస్తుతం వర్మ మ్యాచులలో మునిగి తేలుతున్నాయి ఆయా టీమ్స్.


 అయితే వరల్డ్ కప్ ప్రారంభం కాకముందు నుంచే గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రపంచ కప్ లో విజేతగా నిలిచే టీం ఏది.. సెమి ఫైనల్ వరకు చేరుకునే టీమ్స్ ఏవి అనే విషయం గురించి ఎంతోమంది మాజీ ఆటగాళ్లు రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలాంటి రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. కాగా ఇప్పుడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ ప్రారంభం కాకముందే సెమీ ఫైనల్ కు వెళ్ళబోయే టీమ్స్ ఏవి అన్న విషయాన్ని అంచనా వేశాడు


 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అయ్యే వరకు తాను వేచి ఉండలేకపోతున్నానని ఇంగ్లాండ్ మాజీ మైకేల్ వాన్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఇండియా, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయని అంచన వేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. అయితే సెమీఫైనల్కు వెళ్ళబోయే జట్లలో అటుపటిష్టమైన ఆస్ట్రేలియాకు మాత్రం మైకల్ వాల్ చోటు ఇవ్వకపోవడం గమనార్హం. మరి మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్పులో ఏ టీమ్స్ సెమీఫైనల్ వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc