
ఈ క్రమంలోనే ఏ టీం ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో జరిగిన వన్డే వరల్డ్ కప్ లలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేసి రికార్డులను సృష్టించారు అన్న విషయం కూడా చర్చకు వచ్చింది. అయితే సాధారణ ద్వైపాక్షిక సిరీస్ అంటేనే కొంతమంది ఆటగాళ్లు కాస్త ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటిది వరల్డ్ కప్ లో భారీగా పరుగులు చేయడం అంటే కాస్త కష్టం అని చెప్పాలి.
మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సింగిల్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ ఎవరు.. ఇలా అత్యధిక పరుగులు చేసి టాప్ లో ఎవరు ఉన్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ లిస్టు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ 673 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 2003 వన్డే వరల్డ్ కప్ లో సచిన్ 673 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత 2007 వన్డే వరల్డ్ కప్ లో మాథ్యూ హెడెన్ 659 పరుగులు, 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 648, డేవిడ్ వార్నర్ (2019) 647 షకీబ్ అల్ హసన్ (2019) 606, కేన్ విలియంసన్ (2019) 578, జోరుట్ (2019) 556, జయవర్తనే (2007) 548 పరుగులు చేశారు.