అయితే గత కొంతకాలం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కొన్ని ఫ్రాంచైజీలకు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవాలి అన్నది కేవలం కలగానే మిగిలిపోతూ ఉంది. ఇక ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో అన్ని జట్లు కూడా తమ టీం లో ఉన్న కొంతమంది ఆటగాళ్ళను వదులుకొని.. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటూ ఉన్నాయి. అంతేకాదు ప్రత్యేకమైన వ్యూహాలతో బరిలోకి దిగుతూ ఉన్నాయి. కానీ అటు ఐపీఎల్ టైటిల్ గెలవాలని కల మాత్రం నెరవేరడం లేదు. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ జట్టులో ఉన్న ఆటగాళ్లను మార్చడమే కాకుండా ఏకంగా కోచింగ్ సిబ్బందిని కూడా మార్చడం పైన దృష్టి పెట్టాయి అని చెప్పాలి. దీంతో కొన్ని టీమ్స్ కి పాత కోచింగ్ సిబ్బందినీ తొలగించడంతో కొత్త కోచ్ లు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపిఎల్ 2024 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ షేన్ బాండ్ ను అసిస్టెంట్ కోచ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా నియమించింది. అయితే ఇటీవలే ముంబై బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి షైన్ బాండ్ రాజస్థాన్ బౌలింగ్ కోచ్ బాధ్యతల నుంచి మలింగా తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరిని కూడా మళ్లీ ముంబై, రాజస్థాన్ జట్లు నియమించుకున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆటగాళ్లను మార్చుకున్నట్లుగానే కోచ్లను మార్చుకున్నాయి ఈ రెండు టీమ్స్?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి