ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కాలో భాగంగా భయంకరమైన జట్టుగా పేరుగాంచిన సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇటీవల ఊహించిన పరాజయం ఎదురయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు నమోదు చేస్తూ వరుస విజయాలతో దూసుకు వచ్చిన ఆ టీం.. ఇటీవల టీమిండియాతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఘోర పరాజయం చవిచూసింది. ఏకంగా 243 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకు ముందు మ్యాచ్ లలో  ఒక అద్భుతమైన ప్రదర్శన చేసిన సౌతాఫ్రికా భారత్ ను మాత్రం ఎదురుకోవడంలో పూర్తిగా విఫలమైంది.


 భారత బౌలింగ్ విభాగం ముందు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విభాగం పేక మేడల కూలిపోయింది అని చెప్పాలి. దీంతో ఈ వరల్డ్ కప్ లో దారుణమైన పరాజయాన్ని చవిచూసి తీవ్ర నిరాశల్లో కూరుకుపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు. అయితే ఇలా ఓటమిబాదిలో ఉన్న సౌతాఫ్రికా జట్టుకు ఇప్పుడు మూలగే నక్కపై తాటిపండు పడ్డ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఓటమి బాధలు నిరాశలో ఉన్న జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి. జట్టులో ఉన్న కీలక ఆటగాడు గాయం కారణంగా టీమ్ కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.


 ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతూ ఉన్నాడు లుంగీ ఎంగిడి. అయితే అతను కాలిగాయంతో  బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో అతను ప్రపంచ కప్ లోనే మిగతా మ్యాచ్ల నుంచి తప్పుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై అటు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అయితే అతని స్థానంలో ఇప్పటికే రిలీ రూసో భారత్ కూడా వచ్చాడట  మరో ఫేసరు విలియమ్స్ అందుబాటులో ఉండడంతో.. ఇక బ్యాకప్ గా రూసోని జట్టులోకి తీసుకున్నారు అని తెలుస్తుంది నిజంగా ఎంగిడి లాంటి బౌలర్ దూరం కావడం మాత్రం సౌత్ ఆఫ్రికా కు భారీ ఎదురు దెబ్బ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc