ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది అని చెప్పాలి. ప్రత్యర్థి టీమ్స్ అన్నింటిని కూడా చిత్తుగా ఓడించి సొంత గడ్డపై తమకు తిరుగులేదు అని నిరూపించింది. కానీ ఇప్పుడు టీమిండియాకు అసలైన సవాలు ఎదురు కాబోతుంది. ఎప్పుడు భారత జట్టుకు కఠినమైన సవాలు విసిరే ప్రత్యర్థి న్యూజిలాండ్ తో కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. 2019లో ఇదే జట్టు చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టింది భారత జట్టు. దీంతో ఇప్పుడు ఏం జరగబోతుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే భారత జట్టు సొంత గడ్డపై పటిష్టంగా ఉంది. ఇక తప్పకుండా విజయం సాధిస్తుంది అని క్రికెట్ విశ్లేషకులు అంచన వేస్తున్నారు.
కానీ అదే సమయంలో అండర్ డాగ్స్ గా బరిలోకి దిగే న్యూజిలాండ్ జట్టును ఎక్కడా తక్కువ అంచనా వేయొద్దు అంటూ సూచిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే కొన్ని ఘనంగాలను కూడా ప్రస్తావిస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు 2007, 2011 వరల్డ్ కప్లలో సెమీఫైనల్ లో ఓడిపోయింది. 2015, 2019 వరల్డ్ కప్లలో రన్నరఫ్ గా నిలిచింది. ఇలా వరల్డ్ ఛాంపియన్గా నిలిచే ఛాన్స్ కి కొన్ని అడుగుల దూరంలో న్యూజిలాండ్ ఇంటి బాట పట్టింది. దీంతో వరల్డ్ కప్ టైటిల్ అందుకోవాలని కసితో ఉన్న న్యూజిలాండ్.. ఈసారి అంత ఈజీగా తిరిగి వెళ్ళదు.అందుకే రోహిత్ సేన కివిస్ ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైన ప్లాన్లు సిద్ధం చేసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి