ఈ క్రమంలోనే సీనియర్ క్రికెటర్లు అందరికీ కూడా విశ్రాంతి ప్రకటించగా.. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలోని యంగ్ టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో తలబడుతుంది. అయితే మొదటి మ్యాచ్ లోనే అద్భుతం చేసి చూపించింది భారత జట్టు. సీనియర్లతో నిండిన ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసి209 పరుగుల భారీ టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచగా.. టీమిండియా వీరోచిత పోరాటం చేసి.. ఈ టార్గెట్ ను చేదించింది. ఈ క్రమంలోనే ఈ లక్ష్య చేదనతో టీమ్ ఇండియా ఒక అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించింది అని చెప్పాలి.
అంతర్జాతీయ టి20 లలో 200 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ టార్గెట్ ను అత్యధిక సార్లు చేదించిన జట్టుగా భారత జట్టు నిలిచింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 లో భారత జట్టు ఐదుసార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు టార్గెట్ ను చేదించింది. ఇటీవల ఆస్ట్రేలియా పై 209 పరుగులు టార్గెట్ ను చేదించడం తో ఈ రికార్డు సృష్టించింది టీమిండియా. ఇక భారత జట్టు తర్వాత ఈ లిస్టు లో సౌత్ ఆఫ్రికా నాలుగు సార్లు, పాకిస్తాన్ మూడుసార్లు, ఆస్ట్రేలియా మూడుసార్లు ఇలా 200 ప్లస్ పరుగులను ఛేదించిన టీమ్స్ గా కొనసాగుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి