ఇటీవలే ముగిసిన 2023 వన్డే వరల్డ్ కప్ ఇండియా వేదికగా జరిగింది. ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సెమి ఫైనల్ వరకు పది మ్యాచ్లలో ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలుస్తూ వెళ్లిన టీమిండియా అటు ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలుపు కోసం ఎంతో పోరాటం చేసినప్పటికీ చివరికి ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. భారత జట్టు ఓటమితో అటు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. భారత జట్టుకు టైటిల్ గెలవాలని మరోసారి కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి.


 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పుడెప్పుడో జరిగింది. ఈ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నాయ్. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన ఏదో ఒక విషయం తెరమీదకి వస్తూ హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన సమయంలో ఏకంగా కొంతమంది ప్రేక్షకులు టీవీలను పగలగొట్టడం లాంటివి కూడా చేశారు. ఇంకొంతమంది ఏకంగా వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో టీవీ ఆఫ్ చేశారు అన్న కారణంతో సొంత వారిని హత్య చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగిన రోజే జరిగిన మరో షాకింగ్ ఘటన ఇటీవల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


  ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోవడంతో అందరూ కూడా నిరాశలో  మునిగిపోయారు. కానీ భారత జట్టు ఓటమిని  కొంతమంది సెలబ్రేట్ చేసుకున్నారట. దీంతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. జమ్ము కాశ్మీర్ లోని షేర్ ఏ కాశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ఏకంగా ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు  దీంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ఏకంగా పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: